యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలం మానేపల్లి గ్రామంలో వి బి జి రాంజీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపాధి కూలీలు
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును మారుస్తూ జూలై ఒకటో తేదీ నుండి విబి జి రామ్ జీ పేరును అమలులోకి తీసుకువచ్చింది. దీంతో ఇవాళ పుల్లలచెరువు మండలం మానేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి కూలీలు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ఉపాధికి 125 రోజులు పనిని కల్పించాలన్న లక్ష్యంతో పనులను ప్రారంభించినట్లు ఉపాధి కూలీలు తెలిపారు.