కొండపి: సింగరాయకొండ లో గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్ : సీఐ హజరతయ్య
సింగరాయకొండలో గంజాయి తరలిస్తున్న నలుగురిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సిఐ హజరత్తయ్య మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి నాలుగున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుల వద్ద నుంచి రూ. 10 లక్ష విలువచేసే చోరీకి పాల్పడ్డ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని సీఐ అన్నారు. నిందితులు రాష్ట్రంలో పలు చోరీలకు పాల్పడ్డారని రిమాండ్ కు తరలిస్తున్నామని సీఐ తెలిపారు.