రాయదుర్గం: సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
ఆపద సమయాల్లో అత్యవసర చికిత్సలు చేయించుకున్న వారికి సిఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఊరటను ఇస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలో 28 మంది లభ్థదారులకు మంజూరైన సిఎం రూ. 11.60 లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు ఇంత పెద్ద ఎత్తున సహాయం అందజేస్తున్న సిఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నాగళ్ళిరాజు, మండల కన్వీనర్ లు కురుబ హనుమంతు, కాలువ సన్నన్న, కాదలూరు మోహన్ రెడ్డి, వన్నారెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎస్కె మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.