దర్శి: కురిచేడు మండలంలో చౌడేశ్వరి అమ్మవారి జ్యోతి ఉత్సవం
Darsi, Prakasam | Apr 23, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అగ్రహారం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చౌడేశ్వరి జ్యోతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. 11 జ్యోతులతోపాటు కడవ బాణాలు ఆకట్టుకున్నాయి. జ్యోతుల ఊరేగింపులో మహిళలు కోలాటంతో సందడి చేశారు. జ్యోతులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.