మార్కాపురం: కొనకనమిట్ల మండలంలో గాలివాన బీభత్సం, నేలకు కూలిపోయిన కోళ్ల ఫారం
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం నాగరాజుకుంట గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కోళ్ల ఫారం షెడ్డు నేలకొరిగింది. షెడ్డులో ఉన్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రతుకుతెరువు కోసం కోళ్ల ఫారం పెట్టుకుని జీవనం సాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా షెడ్డు మొత్తం ధ్వంసం అయిపోయింది. దీంతో కోటి రూపాయల వరకు నష్టం జరిగిందని బాధితుడు లక్ష్మిరెడ్డి తెలిపారు.