దర్శి: దర్శి పట్టణంలో సైకిల్ పై వెళ్లి ఆపరేషన్ క్లీన్ స్విఫ్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఆరో వార్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సైకిల్ పై వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో మొక్కలు నాటి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్ల నుంచి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఆమె దృష్టికి వచ్చిన విద్యుత్ సమస్యను సాయంత్రం లోపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.