యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు పునరావస కాలనీలో మౌలిక వసతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
వెలుగొండ ప్రాజెక్టు పునరావస కాలనీలో మౌలిక వసతులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. మార్కాపురం పెద్దారవీడు మండల పరిధిలోని వెలుగొండ ప్రాజెక్టు పునరావస కాలనీలను జెసి శ్రీనివాసులు ప్రాజెక్టు అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ... అప్రోచ్ రోడ్లు త్రాగునీటి సరఫరా విద్యుత్ సౌకర్యం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు