ఉరవకొండ: బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ హిమబిందు బాధ్యతల స్వీకరణ
బెలుగుప్పలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ హిమబిందు గురువారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న కార్తీక్ రెడ్డి ఈతకు వెళ్లి గల్లంతయి మృతి చెందిన విషయం తెలిసిందే.ప్రొద్దుటూరులోని అర్బన్ హెల్త్ సెంటర్లో డాక్టర్ గా పనిచేస్తున్న హిమబిందు ను వైద్య శాఖ ఉన్నతాధికారులు ఇక్కడికి బదిలీ చేశారు.హిమబిందును ఆరోగ్య సిబ్బంది అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు.