రాయదుర్గం: తండ్రి కొడుకు మృతి ఘటనపై రాయదుర్గం ఆసుపత్రి వద్ద బాదితుల ఆందోళనతో ఉద్రిక్తత, అధికారుల నిలదీత
బోరు రిపేరి సమయంలో విద్యుత్ షాక్ కు గురై తండ్రి? కొడుకు మృతి చెందిన సంఘటనతో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతులు ఆనంద్, తేజ ల బందువులు బొమ్మక్కపల్లి గ్రామస్తులు ఆసుపత్రి కి చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ చిన్నరాయుడు బాదితులతో మాట్లాడారు. అదేసమయంలో ఎంపిడివో జయరాములు, పంచాయతీ సెక్రెటరీ లు అక్కడికి చేరుకోగా వారిని చుట్టుముట్టి నిలదీశారు. ఇద్దరి ప్రాణాలు పోతే విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు ఒకరిపై ఒకరు చెబుతూ ఎవరూ బాద్యత తీసుకోవడం లేదని మండిపడ్డారు.