మార్కాపురం: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ (MRP) కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయించే డీలర్లు, దుకాణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విజయ సునీత హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో సాగు సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేకుండా తగిన నిల్వలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు నిర్వహించాలని, ప్రతి విక్రయాన్ని తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలని డీలర్లకు సూచించారు. ఎరువులతో పాటు రైతులకు అవసరం లేని ఇతర ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయవద్దని హెచ్చరించారు.