మద్దూర్: మద్దూర్, దూల్మిట్టలో కాంగ్రెస్ హామీలపై బిఆర్ఎస్ నిరసన
ఎన్నికల హామీలను నెరవేర్చాలని మద్దూర్, దూల్మిట్ట మండలాల్లో బిఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ప్రజావాణిలో దరఖాస్తులు అందజేసి, అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రాలు సమర్పించారు. వెయ్యి రోజులు గడిచినా హామీలు అమలు చేయలేదని వారు ఆరోపించారు.