యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీకి చెత్త సేకరణ రిక్షాలు చెత్త సంపద బుట్టలు సరఫరా చేసిందన్నారు. అందులో భాగంగా మండలానికి 17 పంచాయితీలకు 40 రిక్షాలు 200 బుట్టాలను సిబ్బందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.