దర్శి: దరిశి ఎస్ఐ మురళికి సిఐ గా పదోన్నతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం
Darsi, Prakasam | May 28, 2026 ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న మురళికి సిఐగా పదోన్నతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 34 మంది ఎస్ఐలకు ప్రమోషన్లను ప్రకటించగా మురళికి స్థానం దక్కింది. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన ఆయన మంచి అధికారిగా గుర్తింపు పొందారు. పదోన్నతిపై పోలీసు అధికారులు స్థానికుల హర్షం వ్యక్తం చేశారు.