కొండపి: సింగరాయకొండ పాకాల సముద్ర తీరంలో పర్యటకుల సందడి, అప్రమత్తక వ్యవహరించిన మెరైన్ పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ లో ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్కు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.