గిద్దలూరు: గిద్దలూరు పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సుబ్రహ్మణ్యస్వామి గణపతి స్వామి విగ్రహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎంతో పేరు ప్రతిష్టలు చరిత్ర కలిగిన పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని ఇప్పటికే కొంతవరకు నిధులు కూడా తెచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.