రాయదుర్గం: పోలీసు పహారా మద్య దేవగిరి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చిత్రపట ఊరేగింపు
పోలీసు పహారా మద్య బొమ్మనహాల్ మండలంలోని దేవగిరి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చిత్రపట ఊరేగింపు జరిగింది. గత నెలహ14 న అంబేడ్కర్ జయంతి రోజున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు ఊరేగింపు చేస్తుండగా బొడ్రాయి వద్ద గ్రామస్తులు కొందరు అడ్డుకున్నారు. దీంతో ఆరోజు ఉద్రిక్తత చోటు చేసుకుని ఊరేగింపు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దళిత సంఘాల నాయకులు పోలీసుల సహాయంతో గ్రామంలో ఊరేగింపు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరడంతో ఆదివారం సాయంత్రం రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ నభిరసూల్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మద్య దళితులు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎంఆర్పిఎస్ న