యర్రగొండపాలెం: మిట్టపాలెం గ్రామంలో పడకేసిన పారిశుధ్యం, అవస్థలు పడుతున్న స్థానిక ప్రజలు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెం లో పారిశుధ్యం పడకేసింది. రామాలయం సమీపంలో డ్రైనేజీ లేకపోవడంతో సిసి రోడ్డు పక్కనే మురుగునీరు నిలిచింది. మురుగునీటితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు. సంబంధిత ప్రాంతాలను పరిశీలించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.