గిద్దలూరు: రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో గిద్దలూరులో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ ధరల పెరుగుదలపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరులో పెట్రోల్ డీజిల్ ధరలపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముగిసిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంపై వారు అసహనం వ్యక్తం చేస్తూ వెంటనే పెంచిన ధరలను తగ్గించాలంటే డిమాండ్ చేశారు. పెట్రోల్ కి రూ . 3, 29 పైసలు డీజిల్ కి రూ.3,19 పైసలు పెంచడంపై వాహనదారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.