మార్కాపురం: టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు ని తొలగించాలని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రత్యేక పూజలు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తొలగించాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రత్యేక పూజలు చేశారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను కాపాడాలని ఆయనే స్వచ్ఛందంగా తొలగిపోవాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.