కొండపి: పొగాకు రైతుల సమస్యలు పరిష్కరిస్తాం, అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం పొగాకు బోర్డుఈడి, అధికారులతో పొగాకు రైతుల సమస్యలపై చర్చించారని మంత్రి స్వామి అన్నారు. కనిష్ట దర 200తగ్గకుండా చూడాలన్నారు. అమ్మకానికి వచ్చిన ఒక్క బేలు కూడా వెనక్కి వెళ్ళడానికి లేదని చెప్పారన్నారు. ఈ సీజన్ పొగాకు కొనుగోలు చేశాక పొగాకు అధికంగా పండకుండా నియంత్రణ ఎలా చేయాలనేది ఆలోచించి చేస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అనుకూలంగానే ఉంటుందన్నారు