రాయదుర్గం: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : మీడియాతో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాయదుర్గం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి కొనసాగుతుందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, టంకశాల హనుమంతు, బండి కృష్ణమూర్తి, కడ్డిపూడి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.