ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా నిర్వహించనున్న అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయండి: చాబాల సర్పంచ్ జగదీష్
ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఈనెల 14న నిర్వహించనున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయాలని చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్ పిలుపునిచ్చారు. వజ్రకరూరు మండలం చాబాల లో ఆదివారం ఆయన మాట్లాడారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం అంబేద్కర్ జయంతికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.