మార్కాపురం: ప్రతి ఒక్కరూ వేగం కన్నా ప్రాణం ముఖ్యమని మద్యం సేవించవద్దని హెచ్చరించిన ఎస్సై వేమన
మార్కాపురం గ్రామీణ ప్రాంతాలలో రూరల్ ఎస్సై వేమన విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దరిమడుగు సమీపంలో పలు వాహనాలను తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనికెలు చేసి వాహనదారులకు పలు సూచనలు చేశారు. లైసెన్స్ పొల్యూషన్ పత్రాలు ఇతర ధృవపత్రాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వేగం కన్నా ప్రాణం ముఖ్యమని మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.