గిద్దలూరు: రాచర్ల మండలంలో రైతులకు సబ్సిడీపై పచ్చి రొట్టె విత్తనాలు అందిస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారి మహబూబ్ బాషా వెల్లడి
రసాయన ఎరువులు ఉపయోగించడం వల్ల భూ సారం తగ్గిపోతుందని మార్కాపురం జిల్లా రాచర్ల వ్యవసాయ శాఖ అధికారి మహబూబ్ బాషా అన్నారు. రైతులకు మేలు చేసేందుకు భూసారం పెంచేందుకు పచ్చి రొట్టె విత్తనాలను 50% రాయితీతో రైతులకు ప్రభుత్వం అందిస్తుందని వ్యవసాయ శాఖ అధికారి శుక్రవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో తెలిపారు. సేంద్రియ ఎరువులను రైతులు ఉపయోగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మీనిగే, ఉల్లి పెసర, జనుము 50% రైతుతో అందిస్తూనే ఉన్నారు. గ్రామంలోని వ్యవసాయ శాఖ సిబ్బందిని రైతులు సంప్రదించాలని అన్నారు. అలానే పచ్చి రొట్ట విత్తనాల ధరల వివరాలను సబ్సిడీ వివరాలను వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు.