మార్కాపురం: కంబాలపాడు ఎస్సీ కాలనీ వాసులు మంచినీటి కోసం రోడ్డుపై రాస్తూరోకో
మార్కాపురం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు గత మూడు నెలలుగా త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఖాళీ బిందెలతో రోడ్డుపై బయటయించి రాస్తారోకో చేశారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఫలితం లేదన్నారు. దీంతో సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేష్ తమ సిబ్బందితో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆందోళనకారులను నచ్చజెప్పి రాస్తారోకో విరమింప చేశారు.