మార్కాపురం: జిల్లా కేంద్రంలోని బంగారమ్మ ఆలయంలో విగ్రహ కలశ ప్రతిష్ట మహోత్సవం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో వెలసిన బంగారమ్మ ఆలయంలో విగ్రహ శిఖర కలశ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమం భాగంగా చండి రుద్ర స్వాహకార హోమం ఆదిత్యాది నవగ్రహ హోమం యంత్రములకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం సప్తశతి పారాయణం మంగళహారతి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో దాతల సహకారంతో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.