గిద్దలూరు: బేస్తవారిపేట ఆర్కే జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుండి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట ఆర్కే జంక్షన్ లో సోమవారం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుండి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. మూడవ అంతస్తు పై పని చేస్తున్న సమయంలో బేస్తవారిపేట మండలం పాపాయిపల్లి గ్రామానికి చెందిన బెల్దారి మేస్త్రి షేక్ సలాం అదుపుతప్పి క్రింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో సలాం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.