కొండపి: పొన్నలూరు మండలంలో చోరీలకు పాల్పడ్డ దొంగని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో చోరీలకు పాల్పడ్డ ఓ దొంగను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 24వ తేదీన పరుచూరివారి పాలెం గ్రామంలోని ఓ ఇంట్లో దొంగ చోరీకి పాల్పడ్డాడు. గృహ సంబంధిత పరికరాలతో పాటు కారు బ్యాటరీలు చోరీ చేశాడు. దొంగని కోర్టులో ప్రవేశపడుతున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అనుమానస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.