హిందూపూర్: హిందూపురంలో బెంగళూరుకు చెందిన హరే రామ హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ ఆధ్వర్యంలో వైభవంగా జగన్నాథ రథయాత్ర
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో బెంగళూరు కు చెందిన హరే రామ హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర శనివారం సాయంత్రం వేడుకగా సాగిందిచైతన్య నగర్ లోని ఇస్కాన్ సైట్ నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర మహర్షి వాల్మీకి భవన వరకు సాగింది. ఈ సందర్భంగా భక్తులు జగన్నాథుని దర్శించుకోవడానికి దారుల్లో బారులు తీరారు. జగన్నాథని స్మరణతో భక్తులు వ్రతాన్ని లాగుతుండగా భజన, కోలాట, భక్తి పాటలు, నృత్యం తో భక్త బృందాలు జగన్నాథునికి స్వాగతం పలికారు. రథం వెళ్లే దారుల్లో భక్తులు పుష్పాలు రంగోలి లు వేసి అలరించారు. దాదాపు 35 అడుగుల ఎత్తులో ఉన్న రథం లో కొలువుదీరిన జగన్నాథ, సుభద్ర దేవి ల రథయాత్ర