మద్దూర్: మద్దూరు: గాగిల్లాపూర్ గ్రామంలో రోడ్డు ఆక్రమణపై ఎంపీడీవోకు ఫిర్యాదు
మద్దూరు మండలం గాగిల్లాపూర్ గ్రామంలో పంచాయతీ రోడ్డును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని కోరుతూ ప్రజావాణిలో గ్రామ మాజీ సర్పంచులు, ఉపసర్పంచ్ ఎంపీడీవోకు దరఖాస్తు చేశారు. తప్పుడు పత్రాలతో అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.