కొండపి: సింగరాయకొండ కలికివాయ ఫ్లైఓవర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు, భార్యాభర్తలకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ ఫ్లైఓవర్ సమీపంలో శనివారం కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అంబులెన్స్ లో సింగరాయకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు.