దండేపల్లి: యజమాని మరణంతో శ్మశానం వరకు వెళ్లి చితి చుట్టూ తిరిగిన కుక్క
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో విషాద సంఘటన జరిగింది. అనారోగ్యంతో మృతి చెందిన యజమాని పెట్టెం వెంకన్న అంత్యక్రియల్లో ఆయన పెంచుకున్న శునకం శ్మశానం వరకు వెళ్లి, చితి చుట్టూ తిరుగుతూ విశ్వాసాన్ని చాటుకుంది.