నస్పూర్: శ్రీరాంపూర్ ఎకో పార్క్ పనులను వేగవంతం చేయండి: ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్
శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ ఓసీపీ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఎకో పార్క్ పనులను ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ పరిశీలించారు. వాటర్ ఫౌంటెన్లు, వాకింగ్ ట్రాక్, లైటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, పార్కును శ్రీరాంపూర్ ఏరియాకు ఐకాన్‌గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.