మంచిర్యాల: మంచిర్యాలలో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే, ఆ పాఠశాల ఆవరణలోనే తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.