నస్పూర్: మంచిర్యాల: ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, వేతనాలు, ఓటరు జాబితాపై అందిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.