కనిగిరి: చీమకుర్తికి చెందిన దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకోబోతుండగా రక్షించిన పోలీసులు
ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన దివ్యాంగుడు కోటేశ్వరరావు, ఆయన భార్య భవాని ఆత్మహత్యాయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. వ్యాపారంలో కుటుంబ సభ్యుల వల్ల నష్టం జరుగుతోందంటూ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఈ దంపతులు గురువారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిపై స్పందించిన సీఐ ప్రసాద్ సాంకేతికత సహాయంతో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గురువారం రాత్రే శ్రీశైలంలో వారిని గుర్తించి సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.