గిద్దలూరు: గిద్దలూరు బిసి గురుకుల పాఠశాల భవనాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరిశీలన,పాఠశాల మంజూరు పై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో బీసీ గురుకుల పాఠశాల భవనాలు మంజూరు కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి బీసీ భవనాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఎమ్మెల్యే అన్నారు. బీసీ గురుకుల పాఠశాల భవనాల సాంక్షన్కు కృషి చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి బీసీ నేతలతో పాటు పలువురు ప్రజలు కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు.