కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో పర్యటకుల తాకిడి, అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్లో ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు సందడి చేశారు. ఉమ్మడి జిల్లాలోని నలుమూలల నుంచి సముద్ర తీరానికి పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.