రాయదుర్గం: నెల నెలా ఒకటో తేదీన టంచనుగా పెన్షన్ : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
పేదల సేవలో నెలనెల టంచనుగా సామాజిక పెన్షన్లను అందజేస్తున్న సిఎం చంద్రబాబు అని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు కొనియాడారు. సోమవారం రాయదుర్గం పట్టణంలోని 32 వ వార్డులో మున్సిపల్ అధికారులు, టిడిపి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ నగదు అందజేశారు. నెలనెల సక్రమంగా పెన్షన్ అందుతోందా అంటూ ఆరా తీశారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టిడిపి పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి, పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ పొరాళ్ల పురుషోత్తం, వార్డు ఇన్చార్జ్ రావుత్ రాజశేఖర్, మాజీ వైస్ చైర్మన్ గాజుల వెంకటేశులు, సీనియర్ నాయకులు జమీల్ ఖాన్, కాంబ్లి రాజశేఖర్, కేడిమి తిప