సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలంలో కార్డెన్ సర్చ్, సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ సర్చ్ లో సరైన ధ్రువపత్రాలు లేని వాహనలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలానే ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. మత్తు పదార్థాలు గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు..