దర్శి: ముండ్లమూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిక
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని పురిమెట్ల నాయుడుపాలెం మారెళ్ళ తదితర గ్రామాలలో ఈదురు గాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాలలో ఆరుబయట ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.