యర్రగొండపాలెం: వెలిగొండ ప్రాజెక్టు 2,351 నిర్వాసితులకు 300 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించిన సీఎం చంద్రబాబు
మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టుకు పదివేల కోట్ల రూపాయల అవసరమవుతాయన్నారు. ఇప్పటివరకు సుమారు 6000 కోట్ల రూపాయల ఖర్చు చేశామన్నారు. ముంపు గ్రామాల సుమారు 2351 నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్లు ఒకేసారి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విడుదల చేశామన్నారు. ముంపు గ్రామాల నిర్వాసితుల ఎవరు నిరాశ చెందవద్దని అంతా మంచే జరుగుతుందన్నారు.