కొండపి: ఒంగోలు వైయస్సార్ నగర్ లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పద మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఒంగోలు పట్టణంలోని వైయస్సార్ నగర్ లో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై తీవ్రగాయాలు ఉండడంతో పోలీసులు అనుమానస్పద మృత్తిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.