గిద్దలూరు: కంభం చెరువు కట్టపై ఈనెల 21న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పరిశీలించిన జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం మార్కాపురం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువు కట్టపై నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కంభం చెరువుని ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రజలకు పిలుపునిచ్చారు. యోగా దినోత్సవం రోజు కంభం చెరువు కట్టపై నిర్వహించే యోగాసనాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని అన్నారు.