గిద్దలూరు: గిద్దలూరులో 550 మార్కులకు పైగా సాధించిన పదవ తరగతి విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆదివారం 550 మార్కులకు పైగా సాధించిన పదవ తరగతి విద్యార్థులను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శాలువా మూమెంట్తో సత్కరించారు. కాపు సంఘం ఆధ్వర్యంలో 550 మార్కులకు పైగా సాధించిన కాపు విద్యార్థులను సత్కరించే కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాకుండా సమాజానికి విద్యార్థులకు ఉపయోగపడాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.