మార్కాపురం: పెద్ద నాగులవరం గ్రామంలో రీ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మార్వో చిరంజీవి
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలో రీ సర్వే కార్యక్రమాన్ని ఎమ్మార్వో చిరంజీవి పరిశీలించారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. రైతుల వద్ద నుండి వివరాలు తీసుకొని ధ్రువపత్రాలను పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా రీ సర్వే చేయాలన్నారు. కార్యక్రమంలో సర్వేయర్ సంజీవయ్య వీఆర్వో మహాలక్ష్మి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.