కొండపి: ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. గురువారం జరుగుమల్లి మండలంలో విబిజి రామ్ జి పథకం ప్రారంభించేందుకు మంత్రి స్వామి వచ్చారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఎన్ఆర్జిసి పథకాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించుకున్నామని మంత్రి తెలిపారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడిందని కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వామి అన్నారు.