దర్శి: పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని దొనకొండ ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన
ప్రకాశం జిల్లా దొనకొండ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు వాపోయారు. సిఐటియు కన్వీనర్ అంజయ్య ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికులు నిరసన తెలియజేశారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావుకి వినతిపత్రం అందజేశారు. వేతనాలు లేక తమకు జీవనం సాగించడం కష్టంగా ఉందని 15 రోజులలో తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తామని వారు హెచ్చరించారు.