గిద్దలూరు: కంభం సమీపంలోని జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్సలో కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.