తాడిపత్రి: యాడికి లో జేసీ బ్రదర్స్ తో ముచ్చటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎలా ఉన్నావ్ దివాకర్ అంటూ ఆప్యాయంగా పలకరింపు
యాడికి లో సోమవారం జలధార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యారు. హెలీప్యాడ్ వద్ద జేసీ బ్రదర్స్ ను, ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. జేసీ దివాకర్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నావు దివాకర్ అంటూ అడిగారు. ఆరోగ్యం ఎలా ఉంది అంటూ పలకరించారు. కాసేపు దివాకర్ రెడ్డితో మాట్లాడాడు. సీఎం జేసీ బ్రదర్స్ తో ముచ్చటించడాన్ని టీడీపీ శ్రేణులు సంతోషపడ్డారు.